ధర్నా విజయవంతం చేయండి.

ధర్నా విజయవంతం చేయండి.
రైతులు సమస్యల పరిష్కారానికి వైసిపి పోరాటాలకు సిద్దం
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
కోడూరు – ఆంధ్రప్రభ : రైతులు ప్రభుత్వంటు చెప్పుకుంటూ, రైతులును నడివిరుసున్న కూటమి ప్రభుత్వానికి తగు బుధ్ధి చెప్పేవిధంగా, వైసిపి రైతులు పక్షాన పోరాటాలకు సిద్ధంగా ఉందని అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు.
కోడూరు వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిడియా సమావేశంలో సింహాద్రి మాట్లాడుతూ 2014 సంవత్సరంలోఅధికారంలోకి వచ్చిన టిడిపి, రైతులు పండిచుకుంటున్న సాగు భూములను,22(ఏ) నిషేధిత జాబితాలో చేర్చి,, రైతులు తీవ్రర ఇబ్బందులు గురిచేయడం జరిగిందని అన్నారు.. అప్పుడు ప్రతిపక్ష పార్టీగాఉన్న వైసిపి 22(ఏ) నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని రైతులు పక్షాన పోరాటాలకు చేసుంటే, అప్పుటి ప్రభుత్వం కేసులు నమోదు చేయటం జరిగిందని అన్నారు.
2019అధికారంలోనికి వచ్చిన వైసీపీ రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టి సారించి వెంటనే నిషేధం జాబితాలో ఉన్న భూములను , అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తొలగించటం జరిగిందని తెలిపారు.
మరల రైతులు కు,రాష్ట్ర ప్రజానీకానికి అములు కానీ హామీ ఇచ్చి,, అధికారాన్ని చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం వెంటనే మరల22(ఏ)ను, సాగు భూములను నిషేధం జాబితాలో అమలు చేసి మరల మరల రైతులు నడిపించిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆవేదన వ్యక్తంచేశారు..
రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టి సారించి మరల నిబంధనలు సడలింపు చేసి,22(ఏ)రద్ధు చేయాలని ఈనెల 10న, సాయంత్రం 3గంటలకు, కోడూరు వైసిపి కార్యాలయం వద్దనుంచి రైతులు, వైసిపి నాయకులు కార్యకర్తలు తో కలిసి స్థానిక తాహాశీల్డార్ కార్యాలయంవద్ధ ధర్నా నిర్వహించానున్నట్లు తెలిపారు.. ఈకార్యక్రమానికి అధికసంఖ్యలో రైతులు, పాల్గొన్న విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
