2 Weeks Iran Us Ceasefire : విరామం Andhra Prabha News

2 Weeks Iran Us Ceasefire : విరామం Andhra Prabha News

యుద్ధానికి బ్రేక్​

  • 10న‌ పాకిస్టాన్ లో చ‌ర్చ‌లు
  • ఇరాన్ 10 ప్ర‌తిపాద‌న‌లు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వాషింగ్ట‌న్ ప్ర‌తినిధి

2 Weeks Iran Us Ceasefire : హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి టెహ్రాన్ అంగీకరిస్తే దాడులను నిలిపివేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చిరిక‌ల నేప‌థ్యంలో… రెండు వారాల కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు ఇరాన్ తెలిపింది. ఈ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో శుక్రవారం చర్చలు ప్రారంభమవుతాయి. అమెరికా ఇరాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కు అంగీకారం కుదిరింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు.

2 Weeks Iran Us Ceasefire : ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా రవాణా నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇస్తుంది. ఈ రవాణా ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో జరగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఈ శాంతి ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, రెండు దేశాల ప్రతినిధులు శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లో సమావేశం కానున్నారు.
Iran Us Ceasefire : ఇరాన్ తన 10-అంశాల శాంతి ప్రణాళికను అమెరికాకు సమర్పించింది. ఇందులో ఇరాన్‌పై అన్ని ఆంక్షలను తొలగించాలి. ప్రాంతీయ ప్రాతిపదికన అమెరికా దళాల ఉపసంహరించాలి. నష్టపరిహారం చెల్లించాలి, నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి.

Leave a Reply