4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top News

4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top News

  • ఇరాన్​ క్షిణుల వాన
  • హైషాలో నలుగురు మృతి.. 12 మందికి గాయాలు
  • కువైట్​ లో ఆలీ ఆలం సేలం ఎయిర్​ బేస్​ ధ్వంసం
  • 20 ప్రాంతాల్లో పేలుళ్లు.. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి
  • 15 మంది అమెరికా సైనికులకు గాయాలు
  • టెల్ అవీవ్, నెతన్యా పై దాడులు.
  • ఇజ్రాయెల్ ప్రతిదాడి..
  • గల్ఫ్ దేశాల్లో హై అలెర్ట్..
  • సౌదీ, బహ్రెయిన్ అప్రమత్తం
  • సౌదీలో క్షిపణుల ముప్పు
  • అల్ జుబైల్‌లో మంటలు
  • బహ్రెయిన్‌లో సైరన్లు..
  • విమానాల రద్దు.. గల్ఫ్‌లో ఆందోళన
  • భారతీయులకు హెచ్చరికలు..
  • షాక్‌లోప్రపంచం .
  • మూడో ప్రపంచ యుద్ధ భయాలు

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి)

ఒక్క రాత్రి చాలు , మొత్తం దేశాన్ని నాశనం చేయవచ్చు, అదీ ఆ రాత్రి రేపే కావచ్చు. బుధవారం అర్ధరాత్రి ఈడీటీ (0400 జీఎంటీ) త‌రువాత “ఇరాన్‌లోని ప్రతి వంతెన ధ్వంసం ఖాయం . ప్రతి విద్యుత్ ప్లాంట్ మూత త‌ప్ప‌దు. కాలిపోతుంది, పేలిపోతుంది, మళ్లీ ఎప్పటికీ ప‌నికి రాదు ” అని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న వార్ వార్నింగ్ ను మ‌రో 24 గంట‌లు వాయిదా వేయ‌గా.. రాన్ ఎక్క‌డ త‌గ్గ‌లేదు.

మ‌రి కొన్ని గంట‌ల్లోనే ఇటు ఇజ్రాయెల్‌.. అటు గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ క్షిప‌ణ‌లు కుమ్మ‌రించింది. ఇజ్రాయెల్​ లోని హైఫా, టెల్ అవీవ్ నెతన్యా (Netanya) నగరాలపై క్షిపణుల దాడి జరిపింది. ఈ దాడిలో నలుగురు హైఫా నగర ప్రజలు మృతి చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు కువైట్​ లోని అలీ అల్ సేలం ఎయిర్​ బేస్​ ను ఇరాన్​ ధ్వంసం చేసింది. ఈ దాడిలో 15 మంది అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇటు ఇజ్రాయెల్ కూడా త‌న‌ప‌ని తాను చేసుకుపోతోంది. టెహ్రాన్ ప్రాంతాలలో ఇరాన్ ప్రభుత్వ మౌలిక సదుపాయాపై వైమానిక దాడులు జ‌రిపింది.

4 Dead 12 Hurt : హైఫా హై టెన్షన్​

4 Dead 12 Hurt :

ఇరాన్ ప్రయోగించిన ‘ఖైబర్ షెకాన్’ (Khaibar Shekan) బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్​ హైఫా నగరంలోని ఓ భవనాన్ని ఢీకొన్నాయి. ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 12 మంది గాయపడ్డారు. హైఫా ఓడరేవు (Port) రిఫైనరీ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించాయి. దీనివల్ల సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

4 Dead 12 Hurt :


ఇజ్రాయెల్ ఆరో-3 (Arrow-3) రక్షణ వ్యవస్థ అనేక క్షిపణులను గాలిలోనే అడ్డుకుంది. కొన్ని క్షిపణులు రక్షణ కవచాన్ని ఛేదించి జనసమ్మర్థం ప్రాంతాల్లో పడ్డాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున గం. 03:30 నుంచి 04:15 గంటల మధ్య జరిగాయి. ప్రస్తుతం హైఫాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైఫాతో పాటు టెల్ అవీవ్ (Tel Aviv) పరిసర ప్రాంతాలు నెతన్యా (Netanya) నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది.

4 Dead 12 Hurt : ఇజ్రాయెల్ ప్రతిదాడి

ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై దాడులు జరిపింది. హైఫా , ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజలు బాంబ్ షెల్టర్లలోనే ఉండాలని ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ఆదేశించింది. విద్యాసంస్థలు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.

4 Dead 12 Hurt : కువైట్​ కకావికలం

4 Dead 12 Hurt :

కువైట్‌లోని అలీ అల్ సేలం (Ali Al Salem) ఎయిర్ బేస్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో 15 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు.ఈ దాడి ఏప్రిల్ 6, 2026 (సోమవారం) అర్ధ రాత్రి ఇరాన్ నుండి ప్రయోగించిన డ్రోన్లు కువైట్ గగనతలాన్ని దాటుకుని నేరుగా ఈ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో 15 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే వీరిని చికిత్స కోసం బేస్‌లోని ఆసుపత్రికి తరలించారు. అలీ అల్ సేలం బేస్‌లోని రన్ వే, ఇతర కీలక భవనాలను లక్ష్యంగా ఇరాన్​ డ్రోన్​ లను ప్రయోగించినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. అమెరికా స్పందన: అమెరికా రక్షణ మంత్రి పెట్ హెగ్సెత్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ లోని కీలక కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులను మరింత ఉధృతం చేసింది.

4 Dead 12 Hurt : 20 పాయింట్లలో పేలుళ్లు

4 Dead 12 Hurt :

చైనా మిజార్ విజన్ (MizarVision) విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఈ ఎయిర్ బేస్‌పై సుమారు 20 కి పైగా క్షిపణి/డ్రోన్ పాయింట్లు కనిపించాయి. . ఈ దాడుల్లో ఇటలీకి చెందిన ఒక MQ-9 రీపర్ (Reaper) డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది, విమానాల షెల్టర్లు దెబ్బతిన్నాయని ఇటలీ రక్షణ శాఖ ధృవీకరించింది. దాడి సమయంలో సైనికులు బంకర్లలో ఉండటం వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 15 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారని, కొందరికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.

4 Dead 12 Hurt : ప్రభుత్వం అప్రమత్తం

4 Dead 12 Hurt :

ఈ దాడి తర్వాత కువైట్ ప్రభుత్వం తన సరిహద్దుల్లో భద్రతను అత్యున్నత స్థాయికి (High Alert) పెంచింది. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించకూడదని భావిస్తున్నప్పటికీ, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఆ బేస్ వద్ద గట్టి భద్రత ఉంది. ఇరాన్ తన దాడులను కేవలం ఇజ్రాయెల్ కే పరిమితం చేయకుండా, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపైకి మళ్లించడంతో కువైట్ వంటి దేశాల్లో ఆందోళన నెలకొంది. .

4 Dead 12 Hurt : సౌదీలో అలజడి

ఇరాన్ మంగళవారం తెల్లవారుజామున సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం (Eastern Region) పై 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సౌదీ రక్షణ దళాలు వీటిని అడ్డుకున్నప్పటికీ, కూలిపోయిన శకలాలు కీలక అల్ జుబైల్ (Al Jubail) పారిశ్రామిక ప్రాంతంలో పడటంతో భారీ మంటలు చెలరేగాయి.

4 Dead 12 Hurt : బహ్రెయిన్​ బిక్కుబిక్కు

బహ్రెయిన్ లో మంగళవారం ఉదయం భారత కాలమానం ప్రకారం 07:27 గంటలకు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించారు. ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరిగే ముప్పు ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది ఇరాన్ దాడుల ముప్పు కారణంగా సౌదీ అరేబియా , బహ్రెయిన్‌లను కలిపే కింగ్ ఫహద్ కాజ్వే (King Fahd Causeway) వంతెనను మంగళవారం తాత్కాలికంగా మూసివేశారు.

4 Dead 12 Hurt : షాక్ లో ప్రపంచం

4 Dead 12 Hurt :

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివల్ల గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. దుబాయ్, అబుదాబి, దోహా , మనామా విమానాశ్రయాల నుండి విమానాలు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు. . ప్రయాణికులు ఎయిర్‌ పోర్ట్‌లకు వెళ్లేముందు విమాన సంస్థలను సంప్రదించాలని సూచిస్తున్నారు.గల్ఫ్ దేశాల్లోని చమురు గ్యాస్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది గల్ఫ్ దేశాల ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. భారత ప్రభుత్వం నిరంతరం అక్కడి రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరుపుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచనలు జారీ చేసింది. మొత్తంగా, గల్ఫ్ దేశాలు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్/అమెరికా మతమతమవుతున్నాయి.

ALSO READ : Irgc Chief Killed : మ‌జీద్ ఖాదేమి ఖ‌తం Andhra Prabha News

Leave a Reply