IPL-19 | ఇవాళ కోల్‌క‌తా, పంజాబ్ ఢీ

IPL-19 | ఇవాళ కోల్‌క‌తా, పంజాబ్ ఢీ

వేదిక: కోల్‌కతా
స‌మ‌యం : రా।। 7.30.
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుంది.

IPL-19 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌-19లో ఇవాళ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోరు జ‌ర‌గ‌నుంది. కోల్‌క‌తా, పంజాబ్ ఢీకొన‌నున్నాయి. పంజాబ్ జ‌ట్టు మంచి జోరుమీద ఉంది. ఆడిన తొలి రెండు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. గ‌త సీజ‌న్ మాదిరిగానే పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలో ఈ జ‌ట్టు పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. దూకుడు మీదున్న పంజాబ్‌ను కేకేఆర్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచిన శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌.. తర్వాతి పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది.

ఇక కోల్‌క‌తా విష‌యానికి వ‌స్తే ఆ జ‌ట్టు ఆడిన రెండు మ్యాచుల్లో ఓట‌మి పాలైంది. ఇవాళ (సోమవారం ) పంజాబ్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్, హర్షిత్‌ రాణా, ఆకాశ్‌ దీప్, పతిరన లాంటి టాప్‌ బౌలర్లు దూరం కావడంతో కోల్‌క‌తా బౌలింగ్‌ బలహీన పడింది. గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌ చేయకపోతుండడమూ ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా బంతితో విఫలమై ఓడిన రహానె సేన.. తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పోరులో బంతితో మరోసారి భారీగా పరుగులు ఇచ్చేసింది. ఆపై బ్యాట్‌తో తడబడి పరాజయం చవిచూసింది. అయితే ఈ రోజు కోల్‌క‌తా వేదిక‌గా సొంతగడ్డపై పంజాబ్‌ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Leave a Reply