చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..

చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని చాముండేశ్వరి యూత్ సభ్యులు ఇటీవల మృతి చెందిన ఎలుగల శ్రీనివాస్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ శ్రీనివాస్ ఇటీవల మృతి చెందారు. పట్టణంలో వెల్డింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగించిన శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాముండేశ్వరి యూత్ సభ్యులు తమ వాట్సాప్ గ్రూప్ ద్వారా విరాళాలు సేకరించి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో పంతం కృష్ణ, గాండ్ల రమేశ్, గాండ్ల సంపత్, ఘనగాని రామచందర్, ఆకుల శ్రీను, పంతం సంతోష్, గాండ్ల శ్రీధర్, సీసా అనిల్, గణగాని రాము, గాండ్ల శ్రీకాంత్, మాడిశెట్టి హేమేందర్, గణగాని లక్ష్మణ్, సుతారి శ్రీపతిబాబు, సీసా రాకేష్, ఎలుగల పాండు, మణికొండ సాయి, గాండ్ల శంకర్, మాడిశెట్టి హరీష్, మాడిశెట్టి సాయి, ఎలుగల శ్రావణ్, గాండ్ల పరుశురాములు పాల్గొన్నారు.

Leave a Reply