జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆలంపల్లి నుండి బీజేఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అనంతరం బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో దేశానికి విశేష సేవలందించిన నాయకుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రజా నాయకుడికి నమస్సుమాంజలి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
