సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తి దాయకం…

సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తి దాయకం…

గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి నాయకులు….

గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ : స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తి దాయకమని గుడివాడ టిడిపి నాయకులు అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం (ప్రజా వేదిక)లో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు… జయంతి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు.. దళిత సమాజ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఉన్నతమైనదని తెలిపారు.

జగ్జీవన్‌ రామ్‌ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. అంబేడ్కర్,బాబు జగ్జీవన్ రామ్ కన్న కలలను సాకారం చేసే దిశగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నాయకులు కొడాలి రామరాజు, చేకూరు జగన్మోహన్రావు, నిరంజన్, పండ్రాజు సాంబయ్య, రామదేని వేణుబాబు, బీజేపీ యేసు పాదం, షేక్ జానీ షరీఫ్, దేవరపల్లి కోటి, నిమ్మగడ్డ సత్యసాయి, గోవాడ శివ, పంచకర్ల మహేష్, షణ్ముఖ రెడ్డి, లోయ వాసు, నాయకుడు అంగడాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply