150 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లు..

150 మంది విద్యార్థులకు భారీ స్కాలర్‌షిప్‌లు..

ఐదు కోట్ల నిధులతో ‘కాలేజీ మెంటర్’ ముందడుగు
విజయవాడలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సన్నాహాలు
ఏఐపై ప్రత్యేక సదస్సు, దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల రా

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో కాలేజీ మెంటార్ సంస్థ భారీ స్థాయిలో స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. మొత్తం రూ.5 కోట్ల నిధులతో 150 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు విజయవాడ బ్రాంచ్ మేనేజర్ ఫణి తెలిపారు. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు ‘కాలేజీ మెంటర్ ఫెయిర్’కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది రూ.1 కోటి విలువైన స్కాలర్‌షిప్‌లు అందించామని, ఈ సంవత్సరం రూ.50 లక్షల వరకు నగదు బహుమతులతో పాటు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు 150 మంది విద్యార్థులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆసక్తులు, నైపుణ్యాలు ఒకవైపు ఉండగా, వారు ఎంచుకునే కోర్సులు మరోవైపు ఉంటున్నాయని పేర్కొన్నారు. చదివే చదువు, చేసే ఉద్యోగం వేర్వేరుగా ఉండటం వల్ల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. వ్యక్తిగత నైపుణ్యాలకు అనుగుణంగా సరైన కోర్సు ఎంపికపై మార్గనిర్దేశం చేయడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు రాజశేఖర్ రెడ్డి మంచి ఆలోచనతో గతేడాది ఐఐటీ, ఎంసెట్ పరీక్షలకు ముందు ఇంటర్ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించారని తెలిపారు. అందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశామని చెప్పారు. ఈ నెల 18, 19 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఫెయిర్‌లో భాగంగా 18వ తేదీన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక సదస్సు, ప్యానల్ డిస్కషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పాల్గొని, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా రాయితీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర హెడ్ రాజీవ్, తెలంగాణ హెడ్ మదన్, సంస్థ ప్రతినిధులు అఖిల్, ప్రియా, ప్రియాంక, యశస్విని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply