జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి…

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి…

  • మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్

చిట్యాల, ఆంధ్రప్రభ : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం లో జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ పందిరి గీత రమేష్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మహనీయులకు ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.