అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికలు..

అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికలు..
తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ముండ్లపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ విధానాలపై విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులై పెద్దఎత్తున చేరారు.ఈ సందర్భంగా ఈవూరి వెంకటేశ్వర రెడ్డి, అన్నాబత్తుల శ్రీనివాసరావు, ముత్తవరము హనుమంతరావు, ముత్తవరము రామసూరి, బైసు వీరబాబు, బైసు గోపి తదితరులు కలిపి మొత్తం 6 కుటుంబాలకు చెందిన 20 మంది అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.
అనంతరం గ్రామంలోని ఆరుగురికి 4,10,000 (నాలుగు లక్షల పదివేల రూపాయల) సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు స్వయంగా ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పరంపర, పారదర్శక పాలన, ప్రజలకు చేరువైన సంక్షేమ పథకాలే ప్రజలను తెలుగుదేశం పార్టీ వైపు తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు.అలాగే రైతులకు, మహిళలకు, యువతకు, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అభివృద్ధి లోపాల వల్ల విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు మార్పు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని విమర్శించారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కొత్తగా చేరిన వారికి పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చంద్రుపట్ల లక్ష్మీనరసింహరావు, ఏలూరి గోపాలరావు, ఉమ్మినేని పుల్లారావు, గుత్తా హనుమంతరావు, ఈమని సంజీవ్ రెడ్డి, నల్లజాల శైలజ, గొర్రెపాటి బాబు, బండ్లమూడి వెంకట నరసయ్య, ఉబ్బల దేవదత్తం, బైసు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
