ప్రకృతి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

కుంటాల, ఆంధ్రప్రభ : ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ప్రకృతి పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు మాట్లాడుతూ, నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు స్వీట్ బాల్ మొక్కలు నాటడంతో పాటు, మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. వేసవికాలంలో పక్షులకు నీరు, ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

మంచి ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో మేలని, ముఖ్యంగా సజ్జలు, కొర్రలు, జొన్నలు వంటి సంప్రదాయ ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ, నీటి విలువ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply