ఉట్నూర్ లో ఘనంగా రన్ ఫర్ జోసెఫ్ కార్యక్రమం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్, ఉట్నూర్ డివిజన్ క్రిస్టియన్ అసోసియేషన్, ఉట్నూర్ డివిజన్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమము సెయింట్ పాల్స్ చర్చ్ నుండి ఎన్టీఆర్ చౌక్,అంబేద్కర్ చౌక్,జగజ్జీవన్ రావు చౌక్ , శివాజీ చౌక్, పాత బస్టాండ్, ఎమ్మార్వో ఆఫీస్, ఐటీడీఏ, రాంజీ గోల్డ్ చౌక్,మీదుగా సిఎస్ఐ చర్చి వరకు కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో పాటలు పాడుతూ ఎంతో ఉత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు , యూపీఏ యు సి ఏ యు సి వై ఏ కార్యదర్శులు రెవరెండ్సి యూ.పీ.ఏ ప్రెసిడెంట్ రెవరెండ్ బి డానియల్, హెచ్ ఆర్. జోసఫ్, రెవరెండ్ జె.రత్నం, శామ్యూల్ రెవరెండ్ ఫాదర్ వినోద్, బి.ప్రశాంత్ కుమార్, పాస్టర్ సునీల్, పాస్టర్ దయాకర్, రేవంత్ కి. తిమోతి బాపురావు, పాస్టర్ శామ్యూల్,పాస్టర్ సతీష్,బ్రదర్ జార్జ్, బ్రదర్ శాంతికుమార్, బ్రదర్ శ్రీనివాస్, బ్రదర్ బి లాజర్, పాస్టర్ బి శ్యామ్ రిజయిస్ బ్రదర్ సంసన్, బ్రదర్ దివాకర్, రెవరెండ్ కే ఏలియా,అన్ని క్రైస్తవ సంఘాల సహోదరీ సహోదరులు పాల్గొన్నారు.
