Fair Festival | 30 మందికి అస్వస్థత..

Fair Festival | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామంలో కొండమ్మ తల్లి జాతర ఉత్సవాల సమయంలో బాదంపాలు తాగిన 30 మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జాతర ఉత్సవాల సందర్భంగా బాదంపాలు తాగిన వ్యక్తులు అస్వస్థతకు లోనయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే స్పందించి, బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే గోండు శంకర్ బాధితుల పరిస్థితిని పరిశీలించి, మెరుగైన వైద్యం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు.
