ద్విచక్ర వాహనాన్ని పాల ఆటో ఢీ కొట్టడంతో..

ద్విచక్ర వాహనాన్ని పాల ఆటో ఢీ కొట్టడంతో..
గంగవరం, ఆంధ్రప్రభ : మండలంలోని గంగవరం పంచాయతీ దండపల్లె రోడ్డులో శుక్రవారం రాత్రి మారేడుపల్లె గ్రామం మలుపువద్ద ఓ ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న పాల ఆటో ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సంజయ్ (25) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అతనితో బాటు వెనుక నున్న మరో యువకుడు రాజు (24) కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనంలో ఇద్దరినీ పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన సంజయ్ ను పోస్ట్ మార్టం కోసం ఆ వార్డుకు తరలించగా, తీవ్రంగా గాయపడిన రాజుకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో పాల ఆటో డ్రైవర్ కల్లుపల్లెకు చెందిన హరికృష్ణకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
