చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..

చెన్నూరులో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా నాయకులు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పై అరా తీశారు. నాయకులు పెద్దింటీ శ్రీనివాస్, పలు వార్డుల కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
