TG | యువకుడి గొంతు కోసిన భర్త

TG | యువకుడి గొంతు కోసిన భర్త

TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి గొంతు కోసిన ఘటన కలకలం రేపింది.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం రూరల్ మండలంలోని గొళ్లపాడు గ్రామానికి చెందిన ముక్కా మునేష్ ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. గురువారం తల్లంపాడు వద్ద ఉన్న ఓ వెంచర్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆరెకోడు క్రాస్ రోడ్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ సంపేట శివ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయాల మధ్యలోనే అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు మునేష్ పరారీలోకి వెళ్లిపోయాడు. బాధితుడు శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.