IND vs ENG | ఆదుకున్న పాండ్యా, దూబే.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్

భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య పుణె వేదికగా జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. వికెట్లు కోల్పోయి 79/5తో కష్టాల్లో ఉన్న జట్టును.. శివమ్ దూబేతో కలిసి ఆదుకున్నాడు. వీరిద్ద‌రూ విజృంభణతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 181/8 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సాకిబ్ మహమూద్ వేసిన‌ రెండో ఓవర్లో ఓపెనర్ సంజుషన్సన్ (1)తో పాటు వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ (0), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (0) డకౌట్ గా వెనుదిరిగారు.

ఆ త‌రువాత అభిశేక్ శ‌ర్మ‌(29), రింకూ సింగ్ (30) ప‌రుగుల‌కు ఔట‌య్యారు. దీంతో టీమిండియా 10.4 ఓవ‌ర్ల‌కు 79/5 వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన శివ‌మ్ దూబే (63 బంతుల్లో 7 ఫొర్లు, 2 సిక్సులు 53), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు 53) మెరుపు బ్యాటింగ్ తో జ‌ట్టును ఆదుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి 45 బంతుల్లో 87 ప‌రుగులు సాధించారు.

ఇక‌ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మహమూద్ (3/35), జామీ ఓవర్టన్ (2/31), బ్రైడన్ కార్సే (1/39), ఆదిల్ రషీద్ (1/35) వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా, 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో ఇంగ్లండ్ జ‌ట్టు ఛేజింగ్ కు దిగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *