ఘనంగా అంజన్న జయంతి వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడ వాడలా హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఉదయం నుంచిఆలయాలలో పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో స్వామివారికి సింధూర లేపనంఅభిషేకం,తమలపాకుల పూజ నిర్వహించారు. బిజ్వార్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఊట్కూర్ మండల కేంద్రంలోని మెయిన్ బజార్ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బోయిని వెంకటేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గోశాల హనుమాన్ మందిరం వద్ద ఆలయ నిర్వాహకులు అన్నదానం చేపట్టారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు హనుమాన్ నామస్మరణతో మార్మోగాయి. హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తులతో జరుపుకున్నారు.
