విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి

విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి

తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు

కుంటాల,ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు బుధవారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు పిల్లల భద్రత మరియు సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని చదువు ప్రతి ఒక్క విద్యార్థికి ఎంత అవసరమని పేర్కొన్నారు లక్ష్యంతో చదువుకొని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని పేర్కొన్నారు అదేవిధంగా పిల్లల భద్రత, సంరక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టారు ఆడపిల్లల శుభ్రత గురించి వివరించారు.

అదేవిధంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి మార్గంలో ప్రయాణించాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే ఎంతో మంచిదని పేర్కొన్నారు. మహిళల హక్కుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో వైద్యులు అల్లాడి సురేష్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బందేల నరేష్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మతిన్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఎత్రాజ్ రాజు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply