ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు..

ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు..
14 మంది విద్యార్థుల్లో కంటి సమస్యల గుర్తింపు,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఆర్బీఎస్కే కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలను పీఎం శ్రీ పథకం కింద చేపట్టారు. విద్యార్థులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిని వైద్యులు పరిశీలించారు.ఈ కార్యక్రమాన్ని సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీ యమన్నారు. పాఠశాల స్థాయిలోనే కంటి సమస్యలను గుర్తించడం వల్ల విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉంటారని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను తరచుగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కంటి వైద్యులు డాక్టర్ పుణ్యరాజ్ మాట్లాడుతూ, పరీక్షలలో కంటి సమస్యలతో బాధపడుతున్న 14 మంది విద్యార్థులను గుర్తించామని తెలిపారు. వీరికి అవసరమైన కంటి అద్దాలను త్వరలో అందజేస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ తరహా పరీక్షలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజునూర్, రాజేందర్, అంబాద్రి, వాసుదేవ, వినోద్, రాములు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
