మహిళా అభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి

మహిళా అభివృద్ధికి రేవంత్ సర్కార్ ప్రత్యేక కృషి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, అదే లక్ష్యంతో పాలన కొనసాగుతోందని స్థానిక నాయకులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో మంగళవారం మహిళా సంఘ భవనం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ కృషి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో ఈ భవనానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు మల్లె లక్ష్మణ్, సర్పంచ్ దుమాల మమత, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు, ఇతర నాయకులు పాల్గొని భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
సర్పంచ్ మమత మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో మహిళా భవనానికి నిధులు మంజూరు కావడం అభినందనీయమని అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా పేర్కొన్నారు.
మహిళా సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీవో నర్సయ్య, ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీసీ నరేష్, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, కోరాడి లింబాద్రి, శేవలల్ కౌన్సిలర్ అంజుమ్, సర్పంచ్ రమేష్, ఏఎంసీ డైరెక్టర్ నర్సాపురం జీవన్, ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూతుల రమేష్, ఆర్మూర్ రవి, అడపా రాజేశ్వర్, నూతుల వసంత్, గిర్ని నర్సారెడ్డి, తూర్పు శ్రీధర్, శోభన్ గౌడ్, ఆనంద్ గౌడ్, బాబాగౌడ్, వార్డు మెంబర్లు పురస్థాపు దిలీప్, గుమ్మెర్ల గంగారం, ఉప సర్పంచ్ సేవాలాల్, గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
