కొలనుపాక ఆర్యవైశ్య మఠంలో ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభం
కొలనుపాక ఆర్యవైశ్య మఠంలో ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లో ఆర్యవైశ్యుల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సహిత నగరేశ్వర స్వామి ఆలయం( కోమట్ల మఠం)లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
వేద పండితులు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరేశ్వర స్వామికి మొక్కలు చెల్లించుకునేందుకు ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి హాజరయ్యారు.

