దేశం గర్వించే నగరంగా సీఎం తీర్చిదిద్దుతారు..

దేశం గర్వించే నగరంగా సీఎం తీర్చిదిద్దుతారు..

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది
మాజీ మంత్రి దేవినేని ఉమా

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, దాన్ని దేశం గర్వించే నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గొల్లపూడిలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టి అని పేర్కొన్నారు.

అమరావతి రాజధానిపై వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, ఎక్కడికక్కడ దాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే, గతంలో ప్రజలకు నష్టం కలిగించిన వైసీపీకి ఇప్పుడు వాటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఇక సామాజిక సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఉమా స్పష్టం చేశారు.

 ఎన్నిఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతున్నారని, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply