గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి..

గరుడ వాహనం పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు గరుడ వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అర్చనలు అనంతరం స్వామివారిని అద్భుతంగా అలంకరించి గరుడ వాహనం పై గ్రామ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి హారతులతో స్వామి వారిని దర్శించుకున్నారు. భజనలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన ఈ ఊరేగింపు భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంలో ముంచెత్తింది.
