నూతన పంటల సాగుతో లాభాలు అర్జించాలి

నూతన పంటల సాగుతో లాభాలు అర్జించాలి

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడి గోవర్ధన్

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : రైతులు నూతన పంటలు సాగు చేసుకుని లాభాలు ఆర్జించాలని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ ఏడి గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం మాల్ తుమ్మెద వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడి పైన నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రైతులు కొత్త కొత్త పంటలు సాగు చేస్తూ అదునాతన పద్ధతులు అవలంబించాలని సూచించారు.

వేసిన పంట వేసుకుంటూ పోతే దిగుబడి తగ్గుతుందని పంటలను మార్చుకోవాలని తెలిపారు.పంటలు మార్పిడి చేసినట్లయితే చీడపీడల సమస్య తగ్గుతుందన్నారు.పంట మార్పిడితో అనేక లాభాలు ఉన్నాయన్నారు. పంటల మార్పిడితో నేల ఆరోగ్యం బాగుపడుతుందని వివరించారు.అదే రకంగా అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రతను కూడా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

కామారెడ్డి వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు భూమి అనుగుణంగా ఉందని తెలిపారు. రైతులు రకరకాల పంటలు సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు, విద్యార్థులకు నూతన పంట పద్ధతులు వివరించారు. ఈ కార్యక్రమంలో మాల్ తుమ్మెద టి ఆర్ వి కె కోఆర్డినేటర్ అనిల్ రెడ్డి, శాస్త్రవేత్త డాక్టర్ జీకే రేవంత్ నాతన్, మండల వ్యవసాయ అధికారి నర్సింలు, ఏఈఓ లు శివ, చైతన్య గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply