ఈగల్ కంపెనీ గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన..
ఈగల్ కంపెనీ గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమే గ్రామంలో గోధుమ పంటపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈగల్ సీడ్స్ అండ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రైతు బాలూరి రాజిరెడ్డి వారి పొలంలో ఈ ఫీల్డ్ విజిట్ జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శనకు దాదాపు 50నుంచి 55 మంది రైతులు హాజరై పంట పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా టెర్రిటరీ సేల్స్ మేనేజర్ ఊరడే సతీష్ మాట్లాడుతూ, గత 44 సంవత్సరాలుగా ఈగల్ సీడ్స్ సంస్థ సోయాబిన్, మొక్కజొన్న, వరి, గోధుమలు మరియు కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతూ విశ్వసనీయతను సంపాదించిందన్నారు.ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న గోధుమ రకం “శుశిక”135 , మంచి కంకి పొడవు, అధిక గింజల శాతం కలిగి ఉండటంతో పాటు రసం పీల్చే పురుగులను తట్టుకునే శక్తి కలిగి ఉందని తెలిపారు.
అలాగే ఈ రకం తెగుళ్లకు నిరోధకత కలిగి ఉండి మంచి దిగుబడిని ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త రాజిరెడ్డి, ఉప సర్పంచ్ దుర్గం గంగయ్య,స్థానిక డీలర్లు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సేల్స్ ఆఫీసర్ సాయి కిరణ్ సమన్వయం చేశారు.రైతులు ఈ క్షేత్ర ప్రదర్శన ద్వారా గోధుమ పంటలో మెరుగైన పద్ధతులు మరియు ఉత్తమ రకాలపై అవగాహన పెంపొందించుకున్నారు.
