బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన సీనియర్ బిజెపి నాయకులు దోనూరు వీరారెడ్డి, చౌటుప్పల్ మండలానికి చెందిన దూడెల బిక్షం గౌడ్ లను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నియామకం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా మునుగోడు నియోజకవర్గంలో బిజెపిని బలోపేతం చేయడం కోసం అంకితభావంతో, నిస్వార్ధంగా గత నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతరం శ్రమిస్తుండడంతో పార్టీ నాయకత్వం పార్టీ శ్రేయస్సు కోసం వీరారెడ్డి కి మూడవసారి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించింది.
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకతో రాష్ట్ర స్థాయిలో మూడవసారి బాధ్యతలు అప్పగించినందుకు గాను రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు, సహకరించిన నాయకులకు వీరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధియే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వీరారెడ్డి తెలిపారు.
అదేవిధంగా మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడెల బిక్షం గౌడ్ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా పార్టీలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అన్ని బాధ్యతలు నిర్వహించిన తనకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినందుకుగాను రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కు, సహకరించిన రాష్ట్ర నాయకులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, వివిధ స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తూ సహకరిస్తున్న రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం ఏ బాధ్యతలు ఇచ్చిన నమ్మకంగా పనిచేస్తానని బిక్షం గౌడ్ తెలిపారు.
