జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన..

జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన..

విజయనగరం సబ్ జైల్, రూరల్ పోలీస్ స్టేషన్ల తనిఖీ

విజయనగరం, ఆంధ్రప్రభ : విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా హోం మంత్రి అనిత స్థానిక సబ్ జైలు, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, మహిళా భద్రత కోసం పనిచేస్తున్న ‘శక్తి టీమ్స్’ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

శాంతిభద్రతల పరిరక్షణలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి అనితతో పాటు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ దామోదర్
పాల్గొన్నారు.

Leave a Reply