Maoist Strategy Failure : అదే మూస పద్దతే Andhra Prabha Latest News

Maoist Strategy Failure : అదే మూస పద్దతే Andhra Prabha Latest News
కాలంతో మారటం లేదు
మార్పుకు అణుగుణం కాదు
ఇది వ్యూహాత్మక వైఫల్యం
అందుకే వ్యూహాలు సరిపోలేదు
మావోయిస్టు అగ్రనేత చెల్లూరు నారాయణరావు..
ఉద్యమ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

మారుతున్న పరిస్థితులు కాలానికి అనుగుణంగా వ్యూహాలు అమలు చేయకపోవడంతోనే పార్టీ వైఫల్యం చెందిందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు కీలక, వ్యాఖ్యలు చేశారు. 1990లో పీపుల్స్ వార్ పార్టీలో చేరి ఉత్తరాంధ్ర కేంద్రంగా దీర్ఘకాలం కార్యకలాపాల్లో పాల్గొన్న తనను, కాలక్రమేణా దేశంలో జరిగిన మార్పులు ఉద్యమ దిశను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.
Maoist Strategy Failure : అప్పటి పరిస్థితులు వేరు

అడవి, ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేరిన నేపథ్యంలో సామాజిక వాస్తవాలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అయితే ఈ మార్పులను అర్థం చేసుకుని తమ వ్యూహాలను సవరించుకోవడంలో మావోయిస్టు పార్టీ విఫలమైందని విమర్శించారు. కాలానుగుణంగా ఆలోచనల్లో, చర్యల్లో మార్పులు తీసుకురాకపోవడం వల్ల పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడిందని అభిప్రాయపడ్డారు.
Maoist Strategy Failure : ఇప్పటికీ మూస పద్దతే

పార్టీ నిర్ణయాలు ఇప్పటికీ మూస పద్ధతుల్లోనే కొనసాగుతున్నాయని, వ్యూహాత్మకంగా సరైన ఎత్తుగడలు అమలు చేయలేకపోవడం ప్రధాన లోపమని ఆయన స్పష్టం చేశారు. సైద్ధాంతికంగా బలంగా ఉన్నప్పటికీ, ఆ సిద్ధాంతాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసే విధానంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Maoist Strategy Failure : మృతులు శత్రువులు కాదు

తాను పాల్గొన్న పోరాటాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై స్పందిస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారు వ్యక్తిగత శత్రువులు కాదని, ఉద్యమ పరిస్థితుల్లో జరిగిన ఘటనలేనని తెలిపారు. ఇది ఉద్యమ స్వరూపాన్ని ప్రతిబింబించే అంశమని సూచించారు.
Maoist Strategy Failure : హిడ్మా ఎన్ కౌంటర్ తో …

హిడ్మా ఎన్ కౌంటర్ వంటి ఘటనలు కూడా కార్యకర్తల్లో భయాన్ని కలిగించలేదని పేర్కొనడం గమనార్హం. ఇది ఉద్యమ అంతర్గత ధోరణులు, స్థైర్యం ఎలా ఉన్నాయో సూచిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తంగా, మారుతున్న సామాజిక-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ తన వ్యూహాలు, విధానాలను మార్చుకోకపోవడం ఉద్యమ బలహీనతకు ప్రధాన కారణమని చెల్లూరు నారాయణరావు వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఉద్యమ భవిష్యత్ దిశపై విస్తృత చర్చకు దారితీసే అవకాశముంది.

