2 Young Men | పాత కక్షల కోణంలో దర్యాప్తు

2 Young Men | పాత కక్షల కోణంలో దర్యాప్తు
2 Young Men | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జంట హత్యల ఘటన సంచలనం సృష్టించింది. పొలాల్లో ఇద్దరు యువకుల మృతదేహాలు లభించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కోవలూరు మండలం గండవరం గ్రామ శివారులోని పొలాల్లో ఇద్దరు యువకులు హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మృతులను దస్తగిరి మండలానికి చెందిన వెంకటేష్ (29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య (26)గా గుర్తించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు అక్కడికి ఎలా చేరుకున్నారు, ఎందుకు లక్ష్యంగా మారారన్న అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పాత కక్షలు ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తూ ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గండవరం పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
