బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం..
బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎస్సీ కాలనీలోని భవనంలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు బైకులు దగ్ధం అయ్యాయి. ప్రమాద సమయంలో భవనంలో 16 కుటుంబాలు ఉన్నాయి. అయితే.. ప్రాణ నష్టం తప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
