కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ: కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు చురుకుగా పాల్గొంటున్నారు.ఏఐసీసీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు కేరళలోని ఆడూర్ నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలికులుగా నియమించడం జరిగింది. దీంతో ఆయన కొన్నిరోజులుగా కేరళలోని ఆడూర్ కాంగ్రెస్ అభ్యర్థి శాంతికుమార్ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ,కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేసి,గెలుపుకోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఎన్నికల ర్యాలీలో సైతం పాల్గొంటున్నారు.ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రేపు ఆడూర్ నియోజకవర్గం వర్గానికి ఎన్నికల ప్రచారానికి రానున్నదృష్ట ఎంపీ అంటోని ఏఐసీసీ కార్యదర్శి సంతోష్, సజారితా,రాష్ట్ర ముఖ్య నాయకులతో కలిసి సభ స్థలాన్ని,ఏర్పాటును పరిశీలించడమే కాకుండా రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది.

Leave a Reply