కొండగట్టుకు హనుమాన్ దీక్ష స్వాములు పాదయాత్ర..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం నుంచి శనివారం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దర్శనం కోసం పాదయాత్రగా బయలుదేరారు.

ఈ సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్రను ప్రారంభించారు. స్వాములకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.

41 రోజులపాటు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్నామని హనుమాన్ దీక్ష స్వాములు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో భక్తులు ఉత్సాహంగా యాత్రను కొనసాగించారు.