Niharika konidela | ఇక నిర్మాతలకు టెన్షనే..

Niharika konidela | ఇక నిర్మాతలకు టెన్షనే..
Niharika konidela | నిర్మాతలకు టెన్షన్ కలిగించిన నిహారిక అనౌన్స్‌మెంట్
సంక్రాంతి బరిలో భారీ సినిమాల పోటీ
వరుణ్ తేజ్ ‘బరి’ రిలీజ్ పై ఉత్కంఠ
థియేటర్ల కోసం పెరుగుతున్న పోటీ పరిస్థితి
Niharika konidela | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నిహారిక.. నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆతర్వాత యాక్టింగ్ పక్కనపెట్టి.. నిర్మాతగా రాణిస్తుంది. కమిటీ కుర్రోళ్లు, రాకాస సినిమాలు నిర్మించింది. ఇప్పుడు మూడో సినిమాని తన అన్నయ్య వరుణ్ తేజ్ తో స్టార్ట్ చేసింది. ఈ మూవీ టైటిల్ బరి. ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీ మీడియా మీట్ లో నిహారిక అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇది.. కొంత మంది నిర్మాతలకు టెన్షన్ గా మారిందని టాక్. ఇంతకీ.. ఏంటది..?
Niharika konidela | ఆ నిర్మాతలకు టెన్షనే..

నిహారిక వార్నింగ్ అనగానే.. ఇదేదో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అనుకుంటే.. పొరపాటే. మేటర్ ఏంటంటే.. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని.. ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నామని చెప్పారు. సంక్రాంతి అంటే.. సినిమాల పండగ. ఆల్రెడీ రానున్న సంక్రాంతికి భారీ, క్రేజీ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అలాగే మీడియం రేంజ్ సినిమాలు కూడా వస్తున్నట్టుగా ప్రకటించాయి. రానున్న సంక్రాంతికి ఎప్పుడూ లేనంతగా పోటీకి రెడీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో నిహారిక సంక్రాంతికి వస్తున్నాం అని అనౌన్స్ చేయడం అంటే.. సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్న నిర్మాతలకు, థియేటర్ ఓనర్స్ కు టెన్షనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Niharika konidela | సంక్రాంతి పోటీ మామూలుగా లేదుగా..

ఇంతకీ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్న సినిమాలు ఏంటంటే.. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే.. బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. కింగ్ నాగార్జున సంక్రాంతికి వస్తున్నామని ప్రకటించారు. జనవరి 15న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం విశేషం. వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ కాంబో మూవీ సంక్రాంతికి రావడం పక్కా. వీటితో పాటు శర్వానంద్ తన సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెప్పారు. అలాగే నితిన్ కూడా సంక్రాంతికి రావాలి అనుకుంటున్నాడు.

రాజాసాబ్ తో నిరాశపరిచిన మారుతి కూడా సంక్రాంతి టార్గెట్ గా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఏడు సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు వరుణ్ తేజ్ బరి మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేయడం విశేషం. నిహారిక నిర్మాణం.. వరుణ్ తేజ్ హీరో.. సినిమా రిలీజ్ అంటే.. థియేటర్స్ ఇవ్వాల్సిందే.. సంక్రాంతికి వచ్చే ఇన్ని సినిమాలకు థియేటర్స్ ఇవ్వాలంటే.. మామూలు టెన్షన్ కాదు. వీటిలో ఎన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయో.. ఎన్ని సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటాయో క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాలి. మరి.. నిహారిక అనౌన్స్ చేసినట్టుగా బరి నిజంగానే సంక్రాంతి బరిలో ఉంటుందో లేదో చూడాలి.
