రాజీ మార్గమే రాజమార్గం..

రాజీ మార్గమే రాజమార్గం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కోర్టు కేసులలో కక్షలకు పోయి సమయాన్ని డబ్బులను వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు కేసులను పరిష్కరించుకోవాలని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ శిరీష తెలిపారు. చౌటుప్పల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ శిరీష ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కక్షిదారులు పాల్గొని విజయవంతం చేశారు. చౌటుప్పల్ కోర్టులో అత్యధికంగా 350 వివిధ రకాల కేసులు పరిష్కారం చేయడం జరిగింది. లోక్ అదాలత్ ద్వారా 129 క్రిమినల్ కేసులు, 17 బ్యాంకు కేసులు, 204 ట్రాఫిక్ కేసులు పరిష్కరించడం జరిగిందని సివిల్ జడ్జి శిరీష తెలిపారు.

రాజీ పడదగిన కేసులు అన్నింటిలోనూ కక్షిదారులు రాజీ మార్గంలో తమ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి, ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, కోశాధికారి జల్లా రమేష్, లైబ్రరీ సెక్రెటరీ జక్కర్తి శేఖర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ దేశగోని శ్రీశైలం, కార్యవర్గ సభ్యులు ఎండి ఖయ్యూం పాషా, మాజీ అధ్యక్షులు ఎలమోని శ్రీనివాస్, ముత్యాల సత్తిరెడ్డి, పిట్టల బిక్షమయ్య, తాడూరి పరమేష్, మక్తల నరసింహ, బడుగు శ్రీకాంత్, గంగాదేవి రవీందర్, ఏపీపీ ఖాజా నిజాముద్దీన్, డి ఎస్ పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, సూపర్నెంట్ చంద్రిక, ఉమర్, ఖదీర్, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply