104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్

104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్

20.05 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
బత్తిని సుదర్శన్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు,టిజిపిఓఏ

వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : గత కొంతకాలంగా వేతనాలు ఇవ్వకుండా పని చేయించు కొంటున్న 104 సర్వీస్‌ ఉద్యోగులకు ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ వేతనాల బకాయిల మొత్తాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అత్యవసర సేవలు అందిస్తూ పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించే 104 సిబ్బంది కష్టాలను గుర్తించి పెండింగ్ లో ఉన్న వేతనాల చెల్లింపు కోసమై 20 కోట్ల 5 లక్షల రూపాయాలు విడుదల చేస్తూ శనివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ 2025 నుండి,జనవరి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న 9 మాసాల వేతనాలు 104 సర్వీస్‌లో పనిచేసిన ఉద్యోగుల కు విడుదల చేయబడ్డాయి.


ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క,హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ,ఫైనాన్స్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ హెల్త్ లను కలసి చర్చలు జరిపారు.


ఈ నిరంతర కృషి ఫలితంగా ప్రభుత్వం పెండింగ్ వేతనాల విడుదలకు ఆమోదం తెలుపడమే కాక శనివారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది.అలాగే రీడిప్లాయ్‌మెంట్ ద్వారా పోస్టింగ్స్ కల్పించినందుకు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ తరఫున ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


104 సర్వీస్‌లో పనిచేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ తో పాటు లీగల్ అడ్వైజర్ ఎన్. శ్యాం సుందర్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్ బాబు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్, స్టేట్ కోశాధికారి యాదయ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, కార్యదర్శి ఆనంద్ కుమార్ తదితర నాయకులు కృషి చేసినట్లు అసోయోషన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Leave a Reply