కేసముద్రం ప్రభుత్వ పాఠశాలలో ‘బడి బాట’ ప్రారంభం
కేసముద్రం ప్రభుత్వ పాఠశాలలో ‘బడి బాట’ ప్రారంభం
కేసముద్రం, ఆంధ్రప్రభ:
సర్కారు బడుల్లోనే కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఆదివారం కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్‌లో ‘బడి బాట’ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.ప్రతిభావంతులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ స్థాయికి తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు
