Telangana | తల్లి ఆత్మహత్య!

Telangana | తల్లి ఆత్మహత్య!
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సమస్యల నేపథ్యంలో తల్లి, పిల్లల ప్రాణాలు కోల్పోయిన ఈ సంఘటన కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం జులకల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి హత్య చేసి, అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతులను మమత (28), ఆమె కుమారుడు మణికంఠ (5), కుమార్తె ప్రళయ (4)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
