10GramsGold| కొనుగోలు దారులకు మళ్లీ షాక్

10GramsGold| కొనుగోలు దారులకు మళ్లీ షాక్
10GramsGold| ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత్‌లో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలకు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే గోల్డ్ కొనుగోలు తప్పనిసరి. ఈ సమయంలో విక్రయదారులతో జ్యువెలరీస్‌కు కిటకిటలాడుతాయి. ప్రస్తుతం మంచి ముహూర్తాలుండటంతో వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. గల్లీల్లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. అయితే ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణానికి తోడు రూపాయి విలువ కుప్పకూలడం, డాలర్ బలం పుంజుకోవడంతో బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ధరలు పైపైకి పోతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన వీటి ధర ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం రేటు భారీగా పెరగ్గా.. ఈ రోజు (శనివారం) కూడా పెరిగింది. వెండి సైతం అదే దారిలో పయనించింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,510 పెరగ్గా.. 22క్యారట్ల బంగారంపై రూ.2300 పెరిగింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 161 డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,488 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.15వేలు తగ్గుదల చోటుచేసుకోగా.. ఇవాళ (శనివారం) కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది.


