Chittoor | ముగ్గురు దుర్మరణం

Chittoor | ముగ్గురు దుర్మరణం
Chittoor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం సమీపంలో నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, ఆద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
