శ్రీరామ వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం..
శ్రీరామ వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం..
మేకుల కర్రలతో దాడి.
జనసేన అనిల్ కు తల్లో దిగిన మేకులు.
చాకుతో మరో జన సైనికుడు పై దాడి.
ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణం పెదపేటలో శ్రీరామనవమి వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రామాలయం దర్శనానికి వెళ్లగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరునికి మాత్రమే పూజించాలని రాముడికి దండ వెయ్యొద్దు దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి నియంత్రించక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ వాహనాలా ముందు భారీ ఎత్తున పెదపేట ఆందోళనకారులు బైటాయించారు. పోలీసులకు వారికి కొంత తోపులాట జరిగి ఉద్రిక్తల నడుమ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు రామాలయాన్ని దర్శించి, శ్రీరాముడికి దండ అర్పించి అక్కడ నుంచి మరొక రామాలయానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వెనకాల డిప్యూటీ స్పీకర్ను అనుసరిస్తున్న జన సైనికులపై ఒక్కసారిగా 50 మంది దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో గవర అనిల్ కు తలలో మేకులు దిగబడగా, ఆ దాడిని ఆపడానికి వెళ్ళిన మరో జన సైనికుడు పై చాకుతో వీపుపై కత్తిపోట్లుతో ఆందోళనకారులు దాడికి దిగారు. ఇరువురి జనసేనకులకు తీవ్ర గాయాలు కాగా గవర అనిల్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరో జన సైనికుడ్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ సంఘటన తీవ్రస్థాయిలో ఖండించారు. వారిని వెంటనే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
