కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు..

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు..

తొడిమేలతో కారం పొడి తయారీ
ఫుడ్ సేఫ్టీ,పోలీసుల సంయుక్తంగా దాడి
వరంగల్ లో వ్యాపారుల మోసం బట్ట బయలు

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : కారంపొడి పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్న వ్యాపారుల మోసాలను అధికారులు గుట్టురట్టు చేస్తున్నారు. సునాయాసంగా డబ్బును సంపాదించేందుకు గాను అమాయక ప్రజలను మోసం చేస్తున్న కారం పొడి తయారీదారుల అక్రమాలపై అధికార యంత్రాంగం ఫోకస్ చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చేలాగాటమాడుతున్న వ్యాపారుల బాగోతాన్ని బట్ట బయలు చేస్తున్నారు. అక్రమార్కుల చీకటి బాగోతాన్ని అధికారులు గుర్తించి కొరడా ఝులిపిస్తున్నారు.

వరంగల్ ఎనుమాముల మార్కెట్ సమీపంలోని ఓ ఇండస్ట్రీస్ పై ఆహార నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు చేశారు. మిర్చి తొడిమలతో కల్తీ కారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు.70 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా అధికారులు కృష్ణమూర్తి, మౌనికతో కలిసి ఏనుమాముల ఇన్స్ పెక్టర్ జువ్వాది సురేశ్ ఈ తనిఖీలు చేపట్టారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply