వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత

వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు ఘనంగా నిర్వహించాలని పార్టీ జెండా వాడ వాడనా ఎగరాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఈ నెల 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రం వరకు ప్రతి చోట పార్టీ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకుందామన్నారు.
ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు హాజరుకావాలన్నారు. ముఖ్య నాయకుల ఇళ్ల పై జెండా ఎగురవేయాలని సూచించారు.పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్.టి రామారావు కు ఘన నివాళులర్పించాలని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఇంకా పెండింగ్ లో ఉన్న కమిటీల ఏర్పాటుపై కూడా చర్చించారు. నియోజకవర్గ మండల గ్రామ కమిటీలను పూర్తి చేయాలి. ఇందులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళకు భవిష్యత్ లో చురుగ్గా పని చేసే వాళ్ళకు అవకాశం ఉంటుంది.

ప్రతి పోలింగ్ బూత్ లోను చురుకైన బీఎల్ఏ లను నియమించాలన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేలా ఉండాలన్నారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జిలు ప్రధాన కార్యదర్శులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
