సోనియా త్వరగా కోలుకోవాలి..

సోనియా త్వరగా కోలుకోవాలి..
సోనియా గాంధీ సంపూర్ణ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు
ఆత్కూరులోని సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..
ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో పూజలు..
విజయవాడ,ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని గంగ రామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తరుణంలో ఆమె త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఇంటికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి టెంపుల్ లో ఈరోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మాశ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోనియా గాంధీ దేశానికి చేసిన సేవలు అపారమని, ఆమె ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రతి కార్యకర్త మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి, ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోనియా గాంధీ ఆరోగ్యం కోసం సంకల్ప పూజలు చేశారు.
