కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని అంగడి బజార్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో, జామ చెట్ల బావి – కొండాపురం రాముని బండ పై శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దంతురి క్రిష్ణ, బీసు భాషా గౌడ్, నీల యాకస్వామిలు తెలిపారు.

భక్తులు, ప్రజలు, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కళ్యాణ మహోత్సవం సంబంధించి ఎన్ఆర్ ఐ రాపోలు వాసవి సుదర్శన్ ఆర్ధిక సహకారంతో స్వామి వారి కల్యాణ పెండ్లి పందిరి ఏర్పాటు చేశామని… కల్యాణం అనంతరం అభయ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply