సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్

సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నిరంజన్ గౌడ్

మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా మంజులారెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధులు బుధవారం సమావేశమై జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా మండలంలోని అల్లాపురం గ్రామ సర్పంచ్ టేకుల మంజులారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అంకిరెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


భువనగిరిలో సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా సర్పంచులంతా కలిసి సర్పంచ్ల సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు పూలమాలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

Leave a Reply