Ponguleti | ఏర్పాట్లను పరిశీలించిన పొంగులేటి

Ponguleti | ఏర్పాట్లను పరిశీలించిన పొంగులేటి

జగన్నాథపురంలో భారీ రైతు సభ
హాజరుకానున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద అధికారులకు మంత్రి సూచ‌న‌లు

Ponguleti |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, పార్కింగ్‌, తాగునీరు, రాకపోకలు, భద్రత తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొనే అవకాశం ఉన్నందున సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.