క్రిమిసంహారక మందు సేవించి యువకుని మృతి

క్రిమిసంహారక మందు సేవించి యువకుని మృతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఘట్క సాయికుమార్(24) అనే  యువకుడు నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ్మ తెలిపారు. మృతుని సోదరుడు శ్రీనివాస్ ఒక కేసు లో జైలుకు పోవడం తో మనస్తాపం చెంది సాయికుమార్ ఈ నెల 20న  క్రిమిసంహారక మందు సేవించగా, అతనిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply