గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
- 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
చిట్యాల ఎస్సై సతీష్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పాసిగడ్డ తండా శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 500 బెల్లం పానకం ధ్వంసం చేసి, ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు. పాసిగడ్డ తండా శివారు ప్రాంతంలో నాటు సారా (గుడుంబా) తయారీ జరుగుతుందన్న సమాచారంతో, ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 500 లీటర్ల బెల్లం పానకం 5 లీటర్ల తయారు చేసిన గుడుంబాను పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బెల్లం పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారునాటు సారా తయారు చేస్తున్న లావుడ్య కుమార్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్లు లాల్ సింగ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
