పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం
పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లిలో పచ్చదనం పరివ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకంగా నిలుస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలో జాతీయ రహదారి-216 పక్కన చల్లని వాతావరణం కల్పించేందుకు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే విచ్చేసి ఆరు అడుగుల ఎత్తు కలిగిన చింత మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత పదేళ్లకు పైగా గ్రామంలో పచ్చదన పరివ్యాప్తికి డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ – డాక్టర్ తరిగోపుల పద్మావతి అనేక వ్యయ ప్రయాసలను కోర్చి వేలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నారని తెలిపారు. గ్రామస్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సజ్జా చలపతిరావు, మంగళాపురం సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డ్రైనేజీ శాఖ డీఈఈ బాబూ నాయక్, ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి పాల్గొన్నారు.

